కుమార‌స్వామి అనే నేను…

303
H.D. Kumaraswamy To Take Oath As Karnataka Chief Minister Today
- Advertisement -

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా జేడీఎస్ అధ్య‌క్షుడు కుమార‌స్వామి నేడు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నాడు. ఈ ప్ర‌మాణ‌స్వీకారాణికి రాహుల్, సోనియాతో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌రుకానున్న‌ట్లు తెలిపారు. ప్ర‌మాణ‌స్వీకారానికి దాదాపు 3వేల మంది ప్ర‌ముఖులు రానున్నట్టు స‌మాచారం. క‌ర్ణాట‌క‌లో ఉహించ‌ని విధంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ కు కాకుండా జేడీఎస్ను  వ‌రించ‌డంతో కుమార‌స్వామి కింగ్ మేక‌ర్ గా అవ‌త‌రించారు.

H.D. Kumaraswamy To Take Oath As Karnataka Chief Minister Today

తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ నిన్నే క‌ర్ణాట‌క వెళ్లి కుమార‌స్వామికి అభినంద‌న‌లు తెలిపారు. ఈసంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి కుమార‌స్వామితో మాట్లాడినట్టు స‌మాచారం. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ ల మ‌ధ్య మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ స‌మ‌స్య కొలిక్కి వ‌చ్చింది. మొత్తం 34మందికి మంత్రి ప‌ద‌వులు ల‌భిస్తుండ‌గా..అందులో కాంగ్రెస్ 22,జేడీఎస్ కు 12మందికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వితో క‌లిపి మ‌రో 12మంది జేడీఎస్ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ద‌క్కాయి.

H.D. Kumaraswamy To Take Oath As Karnataka Chief Minister Todayరాష్ట్రంలో అతిపెద్ద రెండ‌వ పార్టీగా అవ‌త‌రించిన కాంగ్రెస్ లో 22మందికి మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. సీఎం ప‌ద‌వి జేడీఎస్ కు ద‌క్క‌గా..డిప్యూటీ సీఎం ప‌ద‌వి కాంగ్రెస్ కు వ‌రించింది. డిప్యూటీ స్పీక‌ర్ కేపీసీసీ అధ్య‌క్షుడు ప‌ర‌మేశ్వ‌ర ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నాడు. విరి మ‌ధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ కు డిప్యూటీ సీఎం , స్పీక‌ర్ ప‌ద‌వులు ల‌భించాయి. స్పీక‌ర్ గా కాంగ్రెస్ నేత కేఆర్ ర‌మేశ్ కుమార్ ను ఈనెల 25వ తేదిన ఎన్నుకొనున్న‌ట్లు తెలిపారు. బ‌ల నిరూప‌ణ త‌ర్వాతే మంత్రి ప‌ద‌వుల అంశంలో శాఖల కేటాయింపుల ప్ర‌క్రియ ఉంటుంద‌న్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్.

- Advertisement -