H-1B వీసా ప్రత్యేకతలు…

33
- Advertisement -

భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో ఒకటి వీసా పునరుద్ధరణ. మోదీ బైడెన్ పాలనా కాలంలో H-1B వీసాకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్‌ నుంచి అమెరికా వెళ్లి పనిచేయాలనుకునే వారికి ఈ వీసా ఇస్తారు. ఈ వీసా కావాల్సిన వారు అమెరికాలోని కంపెనీలు నిర్థిష్ట వృత్తుల్లో పనిచేయడానికి విదేశీ ఉద్యోగులకు ఈ వీసా లభిస్తుంది.

కాగా జూన్‌ 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటన సందర్భంగా వీసాల అనుమతి మంజూరు కోసం కీలకమైన ప్రకటన వస్తుందని భావించారు. కానీ స్వల్ప మార్పులతో ఈ వీసాను అమెరికాలోనే పునరుద్ధరించబడుతుందని దీని కోసం బయటకు వెళ్లవలసిన అవసరం లేదని మోదీ చెప్పారు. సాధారణంగా హెచ్‌-1బీ వీసాలు పొందాలకునే వారు 600 రోజుల సమయం పడుతుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు ఈ వీసా కోసం అప్లై చేసుకుంటారు. అందుకోసమే ఈ వీసాలో మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. గతంలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Also Read: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..

దక్షిణ మరియు మధ్య ఆసియా సంయుక్త సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ ప్రకారం భారతీయులకు ఈ సంవత్సరంలో 1మిలియన్ కంటే ఎక్కువగానే హెచ్‌-1బీ వీసాలను బైడెన్ జారీ చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ వేసవి కాలంలో స్టూడెంట్ వీసాలు కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే వర్క్-వీసా గురించి కూడా హామీ ఇచ్చినట్టు తెలిపారు. హెచ్‌-1బీ, ఎల్‌ వీసాల జారీకి శ్రీకారం చుట్టినట్లు డొనాల్డ్‌ లూ తెలిపారు. భారతదేశంలోని ఐటీ నిపుణులు అమెరికాలో పనిచేయడం కోసం ఈ హెచ్-1బీ వీసా మరియు ఎల్ వీసాలు ఇవ్వనున్నారు. వీటి ద్వారా అమెరికాలో పనిచేయడం సులభతరమవుతుంది. అలాగే గ్రీన్ కార్డు రావాలంటే కూడా హెచ్‌-1బీ వీసాలు ఉన్న వారికి అధిక ప్రాధాన్యత లభించనుంది.

Also Read: వర్షాకాలంలో వచ్చే అలెర్జీలకు వీటితో చెక్.. !

- Advertisement -