అమెరికా హెచ్-1బీ వీసాల జారీ ప్రక్రియ.. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు..

108
- Advertisement -

అమెరికాల వెళ్ళాలని, అక్కడ ఉన్నత ఉద్యోగం చేయాలని భావించే యువత ఎక్కువయ్యారు శుభవార్త.. అమెరికా ప్రతి ఏడాది 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. అదేవిధంగా తాజాగా 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొంది. ఆన్ లైన్ లో myUSICS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.

కాగా, రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. రిజిస్ట్రేషన్లకు మార్చి 18 ఆఖరు తేదీ. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి ర్యాండమ్ పద్ధతిలో హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఒక విధంగా ఇది లాటరీ పద్ధతే. ఈ విడతలో వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగంలో చేరే వెసులుబాటు ఉంటుంది. హెచ్1బీ వీసా తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చే వీసా. ఈ వీసాలతో అమెరికాలో అడుగుపెట్టేవారిలో అత్యధికులు భారతీయులే ఉంటారు.

- Advertisement -