సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

21
- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు జ్ఞానేశ్‌ కుమార్. దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడూ ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో మొదటి అడుగు ఓటు వేయడమే. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలి. ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి అని అన్నారు.

కేరళ క్యాడర్‌కు చెందిన ‌1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జ్ఞానేశ్ కుమార్. సీఈసీగా 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 61 ఏండ్లు. 370 రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:కుంభమేళాలో పవన్ కళ్యాణ్

- Advertisement -