మొక్కలు నాటిన GWMC డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్..

105
GWMC Deputy Mayor

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను, తన జన్మదిన సందర్భంగా స్వీకరించి జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ 41డివిజన్‌లో మొక్కను నాటారు. ఈ సందర్భంగా తాను మారొక ముగ్గురికి, నాగుర్ల వెంకటేశ్వర్లు (రైతుఋణ విమోచన కమిషన్ చైర్మన్) మరియు నాగేశ్వరరావు(జీడబ్ల్యూఎంసీ,ఏసీ), రాజీ రెడ్డి (జీడబ్ల్యూఎంసీ,హెల్త్‌ ఆఫీస్‌ ) మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

ఆముగ్గురు కూడా మరొక ముగ్గురితో మొక్కలు నాటించి ప్రకృతి వన ఏర్పాటు కార్యక్రమంలో అందరిని భాగసామ్యం చేయాలని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో కంజర్ల మనోజ్ కుమార్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగాని సూర్య కిరణ్ వర్మ,టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలకోట్ల సుమన్,టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు.