అమరావతికి ఇచ్చింది అప్పుమాత్రమే..తేల్చేసిన బీజేపీనేత!

18
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేలు కోట్లు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి అభివృద్ధికి ఇచ్చిన రూ.15 వేల కోట్లు అప్పు మాత్రమేనని తేల్చేశారు జీవీఎల్.

ఆ అప్పు చెల్లించడానికి 30 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేశారు. ఈ అప్పును కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందా? లేదంటే ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని చెబుతుందా? అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం నిధులు ఏ రూపంలో వచ్చినా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా దెబ్బతిన్న ఏపీకి ఈ నిధులు ఎంతో ఉపయుక్తమని, రాజధాని నిర్మాణం పుంజుకోవాలంటే ఈ నిధులు ఉపకరిస్తాయని అన్నారు.

రాజధాని అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన నిధులు అప్పు మాత్రమేనని వైసీపీ మొదటి నుండి చెబుతూనే ఉంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, ఇది ఖచ్చితంగా ప్రజలపై అదనపు భారమేనని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

Also Read:Gold Price: బంగారం ధరలు..అప్‌డేట్

- Advertisement -