చెంచుల గొంతు నొక్కారు: బాలరాజు

4
- Advertisement -

ఇందిర సౌర గిరి జల వికాసం పథకం నా నియోజకవర్గం నుంచి సీఎం ప్రారంభించారు అన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన బాలరాజు….నిన్న నిర్వహించిన సభ కాంగ్రెస్ శ్రేణుల సభగా మారింది ..దళిత ,గిరిజన ,ఆదివాసీలకు సీఎం సభ లో సముచిత స్థానం ఇవ్వలేదు ..చెంచుల గొంతు నొక్కారు …తమ సమస్యలు చెప్పుకోవడానికి చెంచులకు అవకాశం ఇవ్వలేదు అన్నారు.

కేసీఆర్ హయం లో ఆరులక్షల మందికి ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది ..చెంచు పెంటలను కూడా గ్రామ పంచాయితీలు గా మార్చిన ఘనత కేసీఆర్ దే .చెంచులుండే ప్రాంతం లో సీఎం సభ నిర్వహించలేదు ..బౌరాపూర్ చెంచు లక్ష్మి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే ..చెంచులను లక్ష్మి నరసింహ దేవాలయాన్ని ప్రారంభించాలనుకుంటే వారిని పోలీసులు అడ్డుకున్నారు ..26 మందికి కేసీఆర్ హయం లోనే పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది ..ఎన్నికల కోడ్ తో ఆగిపోయిన పట్టాల పంపిణీని నిన్న రేవంత్ రెడ్డి పూర్తి చేశారు .కొత్తగా చేసిందేమీ లేదు ..రేవంత్ రెడ్డి తాను ఓ రాజు ననుకుంటున్నారు ..ఇందిరా సౌర గిరి జల వికాసం పేరును మార్చాలని సీఎం మంత్రులను సభ వేదిక మీద కోరుతున్నారు ..సీఎం కు మంత్రులకు సమన్వయం లేదని రేవంత్ రెడ్డి మాటలే రుజువు చేశాయి అన్నారు.

సీఎం రేవంత్ నల్లమల ల పుట్టకున్నా పుట్టినట్టు చెప్పుకుంటున్నారు …సీఎం ఎక్కడికి వెళ్లినా నక్కజిత్తుల మాటలు చెబుతుంటారని ప్రజలు ఇప్పటికే గ్రహించారు ..సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో మాజీ గ్రామ సర్పంచ్ ఆత్మహత్య కు కారణమయ్యారు ..కొండారెడ్డి పల్లి లో కూడా సీఎం రేవంత్ కు ప్రజాదరణ లేదు…ఉమామహేశ్వర,చెన్న కేశవ రిజర్వాయర్లకు కేసీఆర్ హాయం లోనే శంఖుస్థాపన లు జరిగాయి ..చివరకు అందాల పోటీలకు కేసీఆర్ ఆనవాళ్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి ..గిరిజనులు ,ఆదీవాసీలకు బేడీలు కేసీఆర్ హాయం లో వేశారని రేవంత్ అంటున్నారు ..నిన్న సభకు రాకుండా చెంచులను నిర్బంధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా ?..గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం లో 17 మంది చనిపోయినా అటు వైపు వెళ్లని అసమర్ధ ,మూర్ఖ సీఎం రేవంత్ రెడ్డి ..సాగు నీళ్లు ఇవ్వకుండా మోటార్లు ,సోలార్ విద్యుత్ ఇస్తే రైతులకు ఏం లాభం ..డిక్లరేషన్లు అలంకార ప్రాయం గా మారాయి ..ఈ ప్రభుత్వం పని అయిపోయిందని ప్రజలు ఇప్పటికే డిక్లేర్ చేశారు..ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా ఇక లాభం లేదు ..60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నట్టే దళిత ,గిరిజన ,ఆదీవాసీల కు మోస పూరిత డిక్లరేషన్ ను సీఎం ప్రకటించారు ..నల్ల మల్ల లో యురేనియం వెలికితీత ను అడ్డుకున్నది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే ..గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియాంకా గాంధి భర్త రాబర్ట్ వాద్రా కంపెనీకి నల్లమల లో ఖనిజ సంపదను తాకట్టు పెడితే బీ ఆర్ ఎస్ అడ్డుకుంది ..ఇపుడు రేవంత్ కన్ను మళ్ళీ ఆ సంపద పై పడ్డట్టుంది ..రేవంత్ రెడ్డి ,రాహుల్ గాంధీ దిగివచ్చినా నల్లమల సంపదను తరలించుకు పోనివ్వం అన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…యంగ్ టైగర్ ఎన్టీఆర్

- Advertisement -