లండన్ లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ఆద్వర్యం లో అచ్చంపేట ఏమ్మెల్యే గువ్వల బాలరాజు తో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం లో ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ కార్య వర్గ సభ్యులు ,యు.కే నలుమూలల నుండి తెరాస కార్యకర్తలు, తెలంగాణా వాదులు హాజరయ్యారు.
ఉద్యమ సమయం నుండి నేటి వరకు పార్టీ లోని అనుభవాలని, కెసిఆర్ ప్రజారంజక పాలన గురించి, ఏమ్మెల్యే గువ్వల బాలరాజు కార్యవర్గ సభ్యులతో పంచుకున్నారు. అలాగే ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు .ఉద్యమ సందర్భంలో ఎన్నారైల పోరాట స్ఫూర్తి ఎప్పటికీ మరువలేమని ముఖ్యంగా లండన్ లో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు.
బంగారు తెలంగాణా నిర్మాణ దిశలో టీ.ఆర్.యస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని పథకాల గురించి వివరించారు. ఎటువంటి సలహాలు అయిన లేదా సందేహాలు ఉన్న వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ ఆహార్నిశలు కష్టపడ్తున్నారని ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు.
సందర్భం ఏదైనా మనమంత కెసిఆర్ వెంట ఉండి వారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వమే ప్రజలకు శ్రీరామ రక్ష అని తెలిపారు. చివరిగా, ఎన్నారై. టి.అర్.యస్ ప్రతినిధులు గువ్వల బాలరాజుని ఘనంగా సన్మానించి, జ్ఞాపిక ను అందచేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి,అశోక్ దూసరి , ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి ,ప్రవీణ్ కుమార్ వీర ,సెక్రటరీ సృజన్ రెడ్డి,మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల ,యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి,వెల్ఫేర్ ఇంచార్జ్ రాజేష్ వర్మ ,ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ ఏసంపల్లి ,ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి ,రవి ప్రదీప్,సత్య చిలుముల ,వెస్ట్ లండన్ ఇంచార్జ్ సురేష్ బుడగం , మరియు ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని ,వెంకీ తదితరులు పాల్గొన్నారు .