పోలీసుల తీరుపై గువ్వల బాలరాజు ఫైర్

3
- Advertisement -

అచ్చంపేట భ్రమరాంబ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి వెళ్లనివ్వకుండా కావాలనే పోలీసులు ఆపారని మండిపడ్డారు గువ్వల బాలరాజు. ఇన్‌స్పెక్టర్ రవీందర్ అనే వ్యక్తి తనని కావాలనే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ కృష్ణతో కుమ్మక్కై టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని.. న్యాయ వ్యవస్థ సుమోటోగా కేసు స్వీకరించించి తనకు న్యాయం చేయాలని కోరారు గువ్వల బాలరాజు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ ఆలయంలో ఉన్నాడని, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆలయంలోకి అనుమతించలేదు పోలీసులు. పోలీసులతో గువ్వల బాలరాజు మరియు బీఆర్ఎస్ నేతల వాగ్వాదం జరగడమే కాదు స్వల్ప తోపులాట జరిగింది. ఆలయం ఎదుటే బైఠాయించారు గువ్వల బాలరాజు.

Also Read:సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..

- Advertisement -