బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణమంటున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేవంత్ మాటలు శుద్ద అబద్దమని…అప్పుడు రేవంత్ ఎక్కడ ఉన్నాడో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా..తెలంగాణలో ఎక్కడైనా పంట పొలాలు ఎండాయో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు కోసం సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని…. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు సంతోషంగా ఉంటే ఆ పార్టీకి నచ్చడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందుతున్నట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
Also Read:ప్చ్.. ‘బేబీ’ రేటింగ్స్ కొనేసిందా?
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో కరంట్ బ్రహ్మాండంగా అందుతుందని…తెలంగాణ సస్యశ్యామలం అయిందని వెల్లడించారు.కరంట్ కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతుందన్న మాట హాస్యాస్పదంగా ఉందని…భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవారా నంబర్ 1 అని, వ్యవసాయం అంటే ఆయనకు తెలియదన్నారు. ఆయన అప్పుడప్పుడు సొంతూర్లో తోటకు వెళ్లేది సురాపానం కోసమేనని చెప్పారు. కాంగ్రెస్ వస్తే వ్యవసాయం సర్వనాశనం అవుతుందన్నారు.
Also Read:హాలీవుడ్ నటుల సమ్మెబాట..