జైపాల్ రెడ్డి…అందరికీ ఆదర్శం: గుత్తా సుఖేందర్ రెడ్డి

177
gutha
- Advertisement -

మాజీ కేంద్రమంత్రి వర్యులు జైపాల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా నివాళులు అర్పించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి….జైపాల్ రెడ్డి రాష్ట్ర ,కేంద్ర మంత్రులుగా పని చేసి ప్రజలకు ఎనలేని సేవ చేశారు..నీతి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా జైపాల్ రెడ్డి గొప్ప పేరును సంపాదించుకున్నారని చెప్పారు.జైపాల్ రెడ్డి బహుబాషాకోవిదుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వారన్నారు.

జైపాల్ రెడ్డి నేటి తరానికి ఆదర్శనీయులు… జైపాల్ రెడ్డి జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శం తీసుకోవాలన్నారు.జైపాల్ రెడ్డి బెస్ట్ పార్లమెంటేరిన్ అవార్డ్ గెలుపొందారు…కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు.జైపాల్ రెడ్డిని గౌరవిస్తూ నెక్లెస్ రోడ్ లో ఘాట్ ని నిర్మించడానికి అర ఎకరం స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -