రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయం: గుత్తా

223
gutha
- Advertisement -

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే బీజేపీ ఉప ఎన్నికల వ్యూహం పన్నిందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం అన్నారు.

కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని …కుటుంబ పాలన అంటున్న రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీలతో రాష్ట్రానికి తీరని నష్టం అని.. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

సెక్యులర్ రాష్ట్రంలో సెక్యులరిజం కేసీఅర్ తోనే సాధ్యం అని…. రేవంత్ పై దాసోజు శ్రావణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలలో ప్రజలకు తినడానికి సరైన తిండి లేదు. అది వదిలి ఇతర అంశాల మీద పీఎం మోదీ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నారు.

- Advertisement -