ఆచరణ సాధ్యం కాని,అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్,బీజేపీలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.
దేశ బడ్జెట్ సగం ఇచ్చినా కాంగ్రెస్ హామీలు సాధ్యంకాదన్నారు.బీజేపీని కేంద్రంలో గద్దె దింపేందుకు కాంగ్రెస్ సమ్మతంగా లేదని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ విచిత్రంగా ప్రవర్తిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ వ్యతిరేక శక్తులు కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
Also Read:బీజేపీకి మరో షాక్.. రఘునందన్ గుడ్ బై ?
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే బీజేపీ బలోపేతానికి కారణమని వెల్లడించారు. నాలుగు వేల పెన్షన్ ను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సమక్షంలోనే ఖమ్మం సభలో కాంగ్రెస్ కుమ్ములాటలు బయటపడ్డాయని విరుచకపడ్డారు.
Also Read:‘దేవర’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్