రైతులు ఆందోళన చెందవద్దు: గుత్తా సుఖేందర్ రెడ్డి

191
gutha
- Advertisement -

ప్రకృతి వైపరీత్యం తో ఈ సారి భారీ వర్షాలు రైతులను ఇబ్బందులు గురి చేశాయని తెలిపారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా……ప్రభుత్వంమే పండించిన ప్రతి పంటలను కొంటున్నది..రైతులకు ఇది ఎంతో లాభం చేస్తుందన్నారు.

సన్నధాన్యం కొనుగోళ్లలో కొంత గందరగోళం నెలకొంది… రద్దీ ఏర్పడింది… దీంతో టోకెన్ లు జారీ చేసి క్రమబద్దీకరణతో కొనుగోలు చేస్తున్నారు… రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.రైతులు ప్రభుత్వానికి ,అధికారులకు సహకరించాలి…….రైతులు ఆందోళన చెందొద్దు….సీఎం కేసీఆర్ ఉండగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాదన్నారు.

తెలంగాణ లో అని వర్గాల వారు ,కులాల వారు కలిసి మెలసి జీవిస్తున్నారు….ఈ మధ్య కొంత మంది కేసీఆర్ ను ఇబ్బందులు గురి చేయాలని బలహీనపరచాలని చూస్తున్నారు….కేసీఆర్ ని బలహినపరుస్తే తెలంగాణ సమాజమే బలహీనం అయినట్లు అవుతుంది….కేసీఆర్ లేకపోతే తెలంగాణ లో ఎక్కడి గొంగిడి అక్కడే అన్న చందంగా మారిపోతుందన్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.. …. అభివృద్ధి లో ముందున్న రాష్ట్రం…దాన్ని చెడగొట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు.ధరణి పోర్టల్, కొత్త రెవెన్యూ చట్టం అద్భుతమైనవి…….. వాటి వల్ల రైతులకు ఎంతో లాభం జరుగుతుందన్నారు.

- Advertisement -