మనోధైర్యంతో కరోనాను జయించవచ్చు: గుత్తా సుఖేందర్ రెడ్డి

177
gutha
- Advertisement -

మనోధైర్యంతో కరోనా జయించవచ్చన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన గుత్తా…ఇందుకు తమ కుటుంబమే ఉదాహరణ అన్నారు. తన కొడుకు,కోడలు, పని మనుషులకు కరోనా పాజిటివ్ రాగా వారంతా ఇంట్లోనే ఉండి సరైన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా జయించ వచ్చన్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డొద్దు.. మ‌నోధైర్య‌మే ఆ వైర‌స్‌కు స‌రైన మందు అని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే కంగారు పడకుండా… తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తే చాలా వరకు కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి కూడా విద్య, వైద్యంపైనే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు ఖర్చు చేస్తున్నారు. నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు, బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు ఒకేసారి ఎవ్వరూ ఊహించలేదని అన్నారు.

మానవత దృక్పథంతో పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యం ఇవ్వాలని సూచించారు. కరోనా కోసం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు.
కరోనాతో సహజీవనం తప్పదని ఇప్పటికే మోడీ, కేసీఆర్ లు స్పష్టం చేసారని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా 100 అంబులెన్స్ లు సమకూర్చడం అభినందనీయమని, అవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

- Advertisement -