- Advertisement -
తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియనివారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా విమోచన దినం అని వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. గవర్నర్ తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తున్నారని … గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగొట్టొద్దని సూచించారు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసి 74 ఏండ్లు పూర్తవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక సెప్టెంబర్ 17 సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం సభ నిర్వహించడం సరికాదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నది ఆగ్రహం వ్యక్తంచేశారు.
- Advertisement -