రెజీనా -నివేదా… ‘శాకిని డాకిని’

106
shakini Dakini
- Advertisement -

ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో చిత్రం శాకిని డాకిని. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నివేదా థామస్ పుట్టిన రోజు సందర్భంగా నేడు (నవంబర్ 2) ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శాకిని డాకిని టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం విశేషం.

ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది.ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.నటీనటులు: రెజీనా, నివేదా థామస్

సాంకేతిక బృందం

డైరెక్టర్: సుధీర్ వర్మ
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్: అక్షయ్ పుల్ల
నిర్మాతలు : డి సురేష్ బాబు, సునిత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్
ప్రొడక్షన్ కంపెనీ: సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్
సినిమాటోగ్రఫి: రిచర్డ్ ప్రసాద్
సంగీతం: మిక్కీ మెల్క్రెరీ
ఎడిటర్: విప్లవ్ నైషధం
లైన్ ప్రొడ్యూసర్: విజయ్ శంకర్ దొంకడ
ఆర్ట్ డైరెక్టర్ : గాంధీ నడికుడికర్
పీఆర్వో : వంశీ-శేఖర్
పిబ్లిసిటీ డిజైనర్ : అనిల్ భాను

- Advertisement -