రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, క్లాప్స్ అండ్ విజిల్స్ బ్యానర్ లో ఎస్.కె సత్య దర్శకత్వంలో వరుణ్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం గుంటూరోడు.. ప్రేమలో పడ్డాడు.. శ్రీ వసంత్ సంగీతం అందించినీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత వరుణ్, మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, డైరక్టర్ సత్య, శ్రీ వసంత్, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, సురభి, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, జెమినీ కిరణ్, భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ సీడీని మోహన్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
డా.మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ – “డైలాగ్స్, ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. దర్శకుడు చాలా బాగా రాశాడు. నిర్మాత చాలా బాగా ఖర్చు పెట్టి సినిమాను నిర్మించాడు. మంచి కథ అని మనోజ్ చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటున్నాను. మా బ్యానర్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన సత్యంగారి మనవడు శ్రీవసంత్ ఈ సినిమాకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. గుంటూరోడు సినిమా పెద్ద విజయం సాధించాలని కోరకుంటూ యూనిట్ అందరికీ అభినందనలు“ అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ – “మా నాన్నగారిలా మనోజ్‌కు మ్యూజిక్ పై మంచి పట్టు ఉంది. నాకు అసలు దాని గురించే తెలియదు. పాటలన్నీ బావున్నాయి. ప్రొడ్యూసర్ వరుణ్‌కు, దర్శకుడు సత్యకు ఆల్ ది బెస్ట్“ అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ – “రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలని నన్ను సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు. కానీ మా నాన్నగారు ఆత్మగౌరవం, ఆత్మమాభిమానం, సంతృప్తి అనేవి నటుడుకి చాలా ముఖ్యమని చెబుతుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్‌లో వర్క్‌ను ఎంజాయ్ చేయమని అంటుంటారు. అందుకే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ఒక మంచి పాత్ర చేయాలని ప్రయత్నించాను. నటుడిగా నిరూపించుకోవాలనే వచ్చాను తప్ప, ఏదో పెద్ద హీరో అయిపోవాలని రాలేదు. నాకు వ్యాపారాలు రావు. అందరికీ నచ్చేలా నటించడమే నాకు వచ్చు. నేను చేసిన పాత్రలు నాకు సంతృప్తినిచ్చాయి.నటుడుగా నన్ను ముందుకు తీసుకెళ్లాయి. నాకు నచ్చిన పాత్రలే చేశాను, ఇకపై కూడా అలాగే చేస్తాను. ఇన్ని సంవత్సరాలు నుండి అబిమానులు అడుగుతున్నారు కాబట్టి, కొత్తదనం ఉన్న సినిమాలతో పాటు కమర్షియల్ సినిమాలు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా గుంటూరోడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. అలాగే నేను లావయ్యానని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఒక్కడు మిగిలాడు అనే సినిమాలో ఎల్.టి.టి.ఇ కు చెందిన క్యారెక్టర్ చేశాను. 1990కు చెందిన గెటప్, సముద్రంలో ఓ గెటప్ , 2017లో ఓ గెటప్ ఇలా వేరియేషన్స్ కనపడతాయి. అందుకనే ఆ సినిమా మధ్యలో వచ్చిన సినిమాల్లో నేను అలా కనపడ్డాను. మరో మూడు నెలల్లో ఒక్కడు మిగిలాడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. ఆ సినిమాలో నా డేడికేషన్ మీకు కనపడుతుంది. దర్శకుడు సత్య కథ చెప్పినప్పుడు హ్యాట్సాఫ్ అనిపించింది. దర్శకుడు సత్యకు థాంక్స్. వరుణ్ నన్ను నమ్మి ఇంత బాగా ఖర్చు పెట్టి సినిమా చేశాడు. వసంత్‌గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. వెంకట్ చాలా బాగా ఫైట్స్ కంపోజ్ చేశాడు.ఈ చిత్రం ప్రతీ ఒక్కరినీ మెప్పిస్తుంది. నా టీంలో ప్రతి ఒక్కరికీ థాంక్స్“ అన్నారు.
ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా మొదటి కమర్షయల్ సినిమా ఇదే. డైరక్టర్ సత్య గారికి, ప్రొడ్యూసర్ వరుణ్ గారికి థ్యాంక్స్. వసంత్ ఇచ్చిన మ్యూజిక్ నాకు చాలా బాగా నచ్చింది. మనోజ్ ఇక నుంచి సెట్ లో నువ్వు చేసే అల్లరిని, మీ ఇంటి ఫుడ్ ను మిస్ అవుతున్నా.. ఈ చిత్రం ప్రతీ ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, నాకు- మనోజ్ కు ఏదో తెలియని కనెక్షన్ ఉంది. నేను మనోజ్ కలిసి అప్పట్లో క్రికిట్ ఆడుకునే టైమ్ లో , వైవీయస్ చౌదరి గారు సలీమ్ సినిమా సమయంలో నన్ను చూడటం, తర్వాత నాకు ఆఫర్ రావడం జరిగింది. మనోజ్ ది నాది 10 ఏళ్ల స్నేహం. ఈ పదేళ్లలో మనోజ్ ఎంతో ఎదిగాడు. మోహన్ బాబు గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ని. ప్రగ్యా చాలా అందంగా ఉన్నావు. డైరక్టర్ సత్య గారికి, ప్రొడ్యూసర్ వరుణ్ కు , మ్యూజిక్ డైరక్టర్ వసంత్ కు… మొత్తం గుంటూరోడు టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
శర్వానంద్ మాట్లాడుతూ, ఈ సినిమా హిట్ కావాలని కోరుకునే వాళ్లలో నేను ముందుంటా. అందరూ నాకు బాగా కావాల్సినవాళ్లే. గుంటూరోడు సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్. మనోజ్ ఎనర్జీ లెవల్స్ చాలా బాగుంటాయి. టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ అన్నారు.
సురభి మాట్లాడుతూ, గుంటూరోడు టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. సాంగ్స్ అన్నీ వినడానికి బాగున్నాయి. పాటల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. మనోజ్- ప్రగ్యా మీ ఇద్దరి జంట ఎంతో బావుంది. అన్నారు.
దర్శకుడు ఎస్.కె.సత్య మాట్లాడుతూ – “శ్రీవసంత్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. డైరెక్టర్ టెస్ట్‌ను బట్టి మ్యూజిక్ ఇవ్వగల సంగీత దర్శకుడు. సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ దగ్గరకు కథ చెప్పడానికి వెళ్ళగానే పాయింట్ కొత్తదా అన్నారు. కాదండి రెగ్యులర్ కమర్షియల్ మూవీ. కానీ మీరు చేస్తే కొత్తగా ఉంటుందని అనగానే ఆయన విని ఎగ్జయిట్ అయ్యారు. సినిమా ప్రారంభం నుండి అదే ఎగ్జయిట్‌మెంట్‌తో వర్క్ చేశారు. సినిమా బాగా రావాలని కష్టపడి కేర్ తీసుకునే హీరో. సినిమా కోసం యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డారు. ప్రతీ ఒక్కరినీ ధన్యవాదాలు. నిర్మాత వరుణ్ నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టి ిసినిమా చేశారు. గన్ షాట్ హిట్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్“ అన్నారు.
నిర్మాత వరుణ్ మాట్లాడుతూ – “మా బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా గుంటూరోడు. దర్శకుడు సత్య అమేజింగ్ టాలెంట్ చూసి థ్రిల్ అయ్యాను. అద్భుతమైన కథ రాసి చక్కగా తెరకెక్కించాడు. మనోజ్ నేచుర్‌కు సరిగ్గా సరిపోయే కథ ఇది. ప్రగ్యా మంచి రోల్‌లో నటించింది. కోటశ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్ సహా మంచి టీంతో వర్క్ చేశాను. శ్రీవసంత్ కథనంతా తెలుసుకుని డెప్త్ ఫీల్ ఉన్న సంగీతం కుదిరింది. సినిమా చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఒక మంచి సినిమా తీయగలిగాం. ఫిబ్రవరి రెండో లేదో మూడో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం“ అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీవసంత్ మాట్లాడుతూ – “అందరి కంటే ఈ కథ ముందు వింది నేనే. డైరెక్టర్ స్యత్య లైన్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. నిర్మాత వరుణ్, హీరో మనోజ్‌కు నా ట్యూన్స్ నచ్చగానే ఈ సినిమా పరంగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. అన్నీ కథలో నుండి పుట్టిన పాటలే. కథలో ఇన్‌వాల్వ్ కావడం వల్ల పాటలు బాగా వచ్చాయి. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చేలా ఉంటుంది“ అన్నారు.
మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ..సంగీతం: శ్రీ వసంత్,సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్, కో– డైరెక్టర్ T. అర్జున్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : S.K. సత్య