- Advertisement -
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ” గుంటూరు కారం “. ఆకాశమంత అంచనాలతో సంక్రాంతి కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి చేస్తున్న మూవీ కావడంతో గుంటూరు కారం పై మొదటి నుంచి హైప్ తారస్థాయిలోనే ఉంది. అందుకు తగ్గట్టుగానే మూవీ సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. ఇక ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం మూవీపై సినిమా చూసిన వారు వారి అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు..
మూవీ చాలా రొటీన్ స్టోరీతో సాగుతుందని, ఇందులో మహేష్ క్యారెక్టరైజేషన్ మాత్రమే కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. మూవీలో మదర్ సెంటిమెంట్ మెయిన్ గా ఉంటుందని, ఆ సెంటిమెంట్ కు బలమైన సన్నివేశాలు తోడై ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదని చెబుతున్నారు. ప్రధానంగా ఇందులో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో త్రివిక్రమ్ ఇంకాస్త శ్రద్ధ చూపాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read:‘గుంటూరుకారం’ హిట్ అవ్వాలంటే?
త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కామిడీ పెద్దగా ఆకట్టుకోలేక పోవడం కూడా మూవీకి మైనస్ అని చెబుతున్నారు. ఇక థమన్ విషయానికొస్తే కుర్చీ మడతబెట్టి సాంగ్ మినహా మిగిలిన సాంగ్స్, బ్యాక్ గ్రాండ్ నిరాశపరిచిందనే కామెంట్స్ చేస్తున్నారు చాలమంది. మహేష్ అభిమానులను ఆకట్టుకునే అన్నీ అంశాలు ఇందులో ఉన్నప్పటికి కమాన్ ఆడియన్స్ కు మూవీ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని చెబుతున్నారు. ఓవరాల్ గా మూవీలో మహేష్ బాబు ఒన్ మ్యాన్ షో చూడవచ్చని, ఓ కొత్త మహేష్ బాబును అభిమానులు చూస్తారని చెబుతున్నారు మూవీ చూసిన వారు. మరి ప్రస్తుతం మూవీకి మిక్స్డ్ టాక్ వస్తున్న నేపథ్యంలో సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
- Advertisement -