Guntur Karam:అదిరే అప్‌డేట్

103
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. జూన్ 12 నుండి హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేయగా ఈ షెడ్యూల్‌లో ఏక‌ధాటిగా షూటింగ్‌ను కంప్లీట్ చేయాల‌నేది ప్ర‌ణాళిక‌లో భాగంగా అనుకున్నారు. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను పూర్తి చేయాల‌నుకున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్రకారం ఈ షెడ్యూల్‌ను మ‌రో నాలుగు రోజుల పాటు వాయిదా వేశారు. 16 నుంచి హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ లోపు సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నుకుంటున్నారు.

Also Read:వెల్లుల్లితో ప్రయోజనాలు!

ఇది మహేష్ కెరీర్‌లో 28వ సినిమా కాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్నారు. మహేష్ సరసన పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Also Read:రాజన్న సిరిసిల్లకు మంత్రి కేటీఆర్…

- Advertisement -