రాముడికి ఇచ్చిన మాటను హనుమాన్ మూవీ టీమ్ నిలబెట్టుకుంది. చెప్పినట్టుగానే హనుమాన్ మూవీ వసూళ్లలో కొంత మొత్తాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చింది. నిన్న ప్రదర్శించిన హనుమాన్ సినిమా ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది. ఈ మూవీ థియోటర్ లో ఆడినన్ని రోజులు కూడా అమ్ముడుపోయే ప్రతి టికెట్‌పై రూ.5ను విరాళంగా ఇవ్వనుంది. ఇంతకీ, హనుమాన్’ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. ఈ సినిమా మొదటి రోజు రూ. 10 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్ విషయానికొస్తే యూఎస్ఏలో 800kకు పైగా డాలర్స్ వసూలు చేసిందని తెలిసింది. నిజంగా’హనుమాన్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని భాషల్లోనూ అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. అందుకే, ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. హను మాన్ క్లైమాక్స్‌లో జై హనుమాన్‌ను అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. 2025లో జై హనుమాన్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. సీక్వెల్ కూడా హను మాన్ తరహాలోనే గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ప్రధానంగా సాగనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. గుంటూరు కారం ఫట్టు, హనుమాన్ హిట్టు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా అదే రోజు విడుదలైన తేజ సజ్జా హనుమాన్ సినిమాకు మాత్రం ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా గుంటూరు కారం సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికీ అయితే గుంటూరు కారం ఫస్ట్ డే 40 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ రెండో రోజుకే కలెక్షన్స్ బాగా పడిపోయాయి.
Also Read:Ram Mandir:22నే ఎందుకు?