మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమాపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి. గుంటూరు కారం సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాకు రెండు ట్రైలర్లను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొదట నార్మల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి, తర్వాత రిలీజ్ ట్రైలర్‌తో సినిమాకు మరింత హైప్‌ను క్రియేట్ చేయనున్నారట. అన్నట్టు గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ కర్ణాటకలో పలు చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమాకు కర్ణాటకలో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సులున్నాయి. మరోపక్క ‘గుంటూరు కారం’లోని మాస్ సాంగ్‌పై మహేశ్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారని..ప్రస్తుతం దాన్ని రీ వర్క్ చేస్తున్నారు’’ అంటూ పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్ దీని పై అడిగిన ప్రశ్నకు ఈ చిత్ర నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. ‘ ‘డియర్ సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్.. గుంటూరు కారం సినిమాలో మొత్తం నాలుగు ఫుల్ సాంగ్స్‌తో పాటూ ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.
ఆ పాట గురించి చెబుతున్నదంతా ఓ గాసిప్ మాత్రమే. క్లిక్స్ కోసం కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. .ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21 నుంచి మిగిలిన ఒక్క పాట (చివరి) షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాము అంటూ నాగవంశీ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. మొత్తానికి గుంటూరు కారం పై అటు పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్నారు.
Also Read:సర్కారు నౌకరి..లిరికల్ సాంగ్