‘గుంటూరు కారం’ సెన్సార్ రివ్యూ ఇదేనా?

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటించిన కొత్త చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే, సెన్సార్ రిపోర్ట్ బయట పడకుండా చిత్రబృందం జాగ్రత్త పడినా.. సెన్సార్ రివ్యూను మాత్రం ఆపలేకపోయారు. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా ఎలా ఉందో చెప్పేశారు. ‘గుంటూరు కారం సినిమాలో మహేష్ క్లాస్ ను, అలాగే మహేష్ బాబు స్టైల్‌ ను కూడా చేస్తారు. ఇక తెలుగులో మహేష్ ను ఎవరూ బీట్ చేయలేరు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.

మహేష్, శ్రీలీల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ‘‘గుంటూరు కారం’ సినిమా అద్భుతమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ. ఇక క్లైమాక్స్ ఓ అద్భుతమైన అనుభూతి. ఎవరూ ఊహించనంతగా ఉంది. క్లైమాక్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. మాటల్లో చెప్పలేం’ అంటూ సెన్సార్ సభ్యులు చెప్పుకొచ్చారు. అలాగే మరో తెలుగు సెన్సార్ సభ్యుడు కూడా ఈ సినిమా గురించి స్పందిస్తూ.. ‘సినిమా యాక్షన్ మైండ్ బ్లోయింగ్. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దాంతో, గుంటూరు కారం సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. ఇక మహేష్ – శ్రీలీల మధ్య కెమిస్ట్రీతో పాటు మహేష్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయట. ఇప్పటికే, నిర్మాత నాగవంశీ సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడారు. ‘ఈ సినిమా ఫసాఫ్ట్‌లో వచ్చే ఫైట్‌ లో ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుంది. ఇక చివరి 45 నిమిషాలు సినిమా అదిరిపోతుంది అంటూ చెప్పాడు. ఇప్పుడు ఈ సెన్సార్ టాక్ మరింతగా హైప్ క్రియేట్ చేస్తోంది.

Also Read:హాయిగా నిద్ర పోవడానికి..!

- Advertisement -