వావ్.. ‘గుంటూరు కారం’.. 40 మిలియన్లు

19
- Advertisement -

ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ఎదురుచూపులకు, గుంటూరు కారం కొత్త ట్రైలర్ సరైన సమాధానం చెప్పింది. ట్రైలర్ లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీని ఎలివేట్ చేస్తూనే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునులే ఉంది. మహేష్ ను ఫుల్ మాస్ కుర్రాడిగా చూపించిన విధానం చూపారుల దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది. దీనికితోడు ట్రైలర్ లోని చిన్నాచితకా CGI విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఫలితంగా గుంటూరు కారం ట్రైలర్ కి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి.

కేవలం ఒక్క రోజులోనే 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది నిజంగా విశేషమే. “చిన్న ట్రైలర్ – పెద్ద వైలెన్స్” తరహాలో గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జనవరి 12న సినిమా విడుదలకు ముహూర్తం పెట్టారు మేకర్స్. భారీ గ్యాప్ తర్వాత వచ్చిన పెద్ద అవకాశం నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ ఎంతో జాగ్రత్తగా సినిమాను తెరకెక్కిస్తున్నారని నిర్మాత నాగవంశీ ఇప్పటికే మహేష్ బాబు అభిమానులకు భరోసా అందించారు. తొలిసారిగా గుంటూరు కారం మూవీ తో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతుంది శ్రీలీల.

ఎరుపెక్కించిన గుంటురు మిర్చితో మహేష్ బాబు, త్రివిక్రమ్ తమ అభిమానులను ఏ మేరకు అలరిస్తారో చూడాలి. రెగ్యులర్ మాస్ చిత్రాల ప్లాప్ సెంటిమెంట్ ను తప్పించుకుని ప్రేక్షకుల మెప్పు పొందగలరా? అనేది వేచి చూడాలి. అన్నట్టు గుంటూరు కారం ఫస్ట్ హాఫ్ లో 20 మినిట్స్, అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని టాక్. ఇక గుంటూరు కారం నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.

Also Read:ఆవాల నూనెతో ప్రయోజనాలు!

- Advertisement -