కమలా హారీస్ టార్గెట్‌గా కాల్పులు..

5
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్థరాత్రి కమలా హారీస్ ఆఫీస్ పై ఫైరింగ్ జరిగింది. ఇప్పటికే రెండు సార్లు ట్రంప్‌పై కాల్పులు జరుగగా ఇది మర్చిపోకముందే కమలా హారిస్‌పై కాల్పులు కలకలం చోటు చేసుకుంది.

అరిజోనా లోని డెమోక్రటిక్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

నవంబర్‌ 5న అమెరికా 47వ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.

Also Read:35 లక్షల పెళ్లిళ్లు..రూ.4.25 లక్షల కోట్ల ఖర్చు!

- Advertisement -