అమెరికాలో కాల్పుల కలకలం..11 మంది మృతి

295
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌ పట్టణంలో శనివారం ఉదయం యూదుల ప్రార్థనా మందిరం(సినగోగ్‌)లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు సహా 11 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో 6 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. ప్రజలు ఉదయపు ప్రార్థనల్లో నిమగ్నమై ఉండగా దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లు వార్తలు వెలువడ్డాయి.

Gunman attacks

దాడి తరువాత నిందితుడు రాబర్ట్‌ బోయర్స్‌ పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించింది. ఇది విద్వేషపూరిత దాడి అని, ఉగ్రకోణం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుండగుడు సెమీఆటోమెటిక్‌ రైఫిల్‌తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితునిపై ఎదురుకాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలైన నిందితున్ని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

దుండగుడు కాల్పులు జరుపుతూ ‘యూదులందరూ చనిపోవాల్సిందే’ అని నినాదాలు చేశాడని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ట్రంప్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని శ్వేతసౌధం పత్రికా వ్యవహారాల కార్యాలయం పేర్కొంది.

- Advertisement -