వరంగల్ తూర్పు నుంచి కేసీఆర్ నిర్ణయించిన అభ్యర్థిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య. వరంగల్లో మీడియాతో మాట్లాడిన సారయ్య కొండా దంపతులపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. కొండ దంపతుల ఫ్యామిలీ నుంచి వరంగల్ ప్రజలు విముక్తి పొందారని చెప్పారు. కొండా దంపతులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చిన సారయ్య…టీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు. తమ అధినేత కేసీఆరే అని తేల్చిచెప్పారు.
ఉద్యమకారులపై దాడులు జరిపిన చరిత్ర కొండా దంపతులదని మండిపడింది టీఆర్ఎస్ నాయకురాలు గుండు సుధారాణి. టీఆర్ఎస్లో ఎలాంటి గ్రూపులు లేవని..ఒంటెద్దు పోకడలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించింది.
వరంగల్ ప్రజలు అంతా గమనిస్తున్నారని కొండా దంపతులకు బుద్ది చెబుతారని చెప్పింది. జయశంకర్ సార్ గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదని స్పష్టం చేశారు.