“థాంక్యూ బన్నీ.. మీ కుమార్తెను మాకు అప్పగించారు..

114
allu arjun

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని నటిస్తున్న శాకుంతలం మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతుందని తెలుస్తోంది. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ కూతురు అర్హ నటిస్తున్న విషయం తెలిసిందే.

తాను తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో అల్లు అర్హ కూడా నటిస్తుండడంపై దర్శకుడు గుణశేఖర్ స్పందించారు. అల్లు అర్హ ‘శాకుంతలం’ చిత్రంలో యువరాజు భరతుడి పాత్ర పోషిస్తోందని తెలిపారు. అర్హ తమ చిత్రంలో నటించేందుకు అంగీకరించిన అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. “థాంక్యూ బన్నీ… మీ కుమార్తెను మాకు అప్పగించారు. చరిత్ర, ఘనతర వారసత్వం, సంస్కృతిపై మీకున్న ప్రేమ, గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. మీ మద్దతుకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మీరు మాపై చూపే అభిమానం వెలకట్టలేనిది” అని పేర్కొన్నారు.