ఇప్పుడేమంటారు మోదీజీ?

264
modi
- Advertisement -

గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 130కి చేరాయి. మరోవైపు గాయపడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధాని సొంత రాష్ట్రంలో ఈ ఘటన జరగడంపై ప్రతిపక్షాలు తీవ్రస్ధాయిలో మండిపడ్డాయి.

ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు 2016 బీజేపీ ప్రచారంలో భాగంగా మోడీ మాట్లాడిన వీడియోని రిలీజ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించింది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకానంద రోడ్ ఫ్రైఓవర్ కూలిపోయింది. అవకతవకల కారణంగానే వంతెన కూలిపోయిందంటూ మమతా బెనర్జీని తప్పుపట్టారు. ఇది దేవుడి పని కాదు, ఇది అవినీతి చర్య. దాని ఫలితమే బ్రిడ్జి కూలిపోయింది. ఇది సిగ్గుచేటు అంటూ మమతపై మోడీ విమర్శలు గుప్పించారు.దీనిని షేర్ చేస్తూ ఇప్పుడేమంటారు మోడీ జీ… గుజరాత్ దుర్ఘటనకు సొంత పార్టీ బాధ్యతను అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. శివసేన సైతం ప్రధాని తీరును ఎండగట్టింది.

పశ్చిమబెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ 2016 మార్చి 31న కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి..

బండికి అధిష్టానం అక్షింతలు..

మొక్కలు నాటిన BB6 కంటెస్టెంట్‌ అర్జున్‌

తెలంగాణ పోలీసులకు..స్పెషల్‌ ఆపరేషన్‌ మెడల్స్‌

- Advertisement -