గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..

54
- Advertisement -

ప్రపంచం మొత్తం మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటుంది. అయితే మే 1ని మహారాష్ట్ర దినోత్సవం మరియు గుజరాత్ దినోత్సవంగా కూడా జరుపుకుంటారని చాలా తక్కువ మందికి తెలుసు. మే మొదటి రోజు రెండు రాష్ట్రాలకు ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న మహారాష్ట్ర మరియు గుజరాత్ రెండు రాష్ట్రాలు ఏర్పడిన మే 1వ తేదీ. అందుకే, ప్రపంచం మొత్తం మే 1ని కార్మిక దినోత్సవంగా జరుపుకున్నా, మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు అంతకంటే పెద్ద కార్యక్రమాన్ని జరుపుకుంటారు.

అప్పటి బొంబాయిలో మరాఠీ, గుజరాతీ, కచ్చి, మరియు కొంకణి వంటి వివిధ భాషలు మాట్లాడేవారు ఉండేవారు. అయితే తమ రాష్ట్రంలో ఇతరుల ఆదిపత్యాన్ని జీర్ణించుకోలేని స్ధానికులు సంయుక్త మహారాష్ట్ర ఆందోళన్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని ఆందోళన ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంతోమంది అసువులు బాశారు. చివరకు బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం భారతదేశ పార్లమెంటు ద్వారా బహుభాషా రాష్ట్రమైన బొంబాయిని గుజరాత్ మరియు మహారాష్ట్రలుగా విభజించడానికి ఆమోదించబడింది. ఈ చట్టం మే 1, 1960 నుండి అమలులోకి వచ్చింది.

ఇక గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి జలపాతంపై కవాతు జరుగుతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి. ఇక్కడ లోథల్, ధోలావిరా, గోలా ధోరో వంటి పురాతన సింధు లోయ నాగరికత ప్రదేశాలున్నాయి. లోథల్ ప్రపంచంలోని మొట్టమొదటి ఓడరేవులలో ఒకటి. భరూచ్, ఖంభట్ తీర నగరాలు , మౌర్య, గుప్తా సామ్రాజ్యాల కాలంలో, పశ్చిమ సత్రాప్స్ శకం నుండి సాకా రాజవంశాల కాలం వరకు ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలుగా పనిచేశాయి.

Also Read:పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రివ్యూ..

గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ప్రపంచంలోని ఆసియా సింహానికి ఏకైక అటవీ ప్రాంతం. సోమనాథపురం శివాలయం,ద్వారక ఆలయం,నాగేశ్వర్ ఆలయం,
బాలి సమన దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందినవి.

జిల్లాల సంఖ్య-33
లోక్‌సభ స్ధానాలు-26
రాజ్యసభ సీట్లు-11
రాష్ట్ర జంతువు-ఆసియా సింహం
రాష్ట్ర పక్షి- గ్రేటర్ ఫ్లెమింగో

Also Read:May Day:కార్మిక దినోత్సవం

- Advertisement -