షా ఓటేశారు.. ప్రశాంతంగా మలివిడత పోలింగ్..

209
- Advertisement -

ఈ రోజు ఉదయం (డిసెంబర్-14) 8 గంటలకు ప్రారంభమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 851మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

పోలింగ్ కోసం 28 వేల 114 EVMలను వినియోగిస్తున్నారు. 25 వేల 558 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2కోట్ల 20లక్షల మంది ఓటర్లు…తమ ఒటు హక్కు వినియోగించుకోనున్నారు. 18న ఫలితాలు ప్రకటించనున్నారు.

నారాన్ పూరలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 93 అసెంబ్లీ సెగ్మెంట్లలో 93 మంది బీజేపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 91 స్థానాల్లో పోటీ చేస్తోంది. సాయుధ పోలీసుల పహరా మధ్య 14 జిల్లాల్లో తుది, రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రెండో దశలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, అల్పేశ్ ఠాకూర్ , జిగ్నేశ్ మేవానీ, సురేశ్ పటేల్ , వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Gujarat elections: Amit Shah votes; asks people to continue ..

..

- Advertisement -