గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా..

197
Vijay Rupani
- Advertisement -

గుజరాత్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కొద్దిసేపటి క్రితం గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు అందజేశారు. విజ‌య్ రూపానీ రాజీనామా చేసిన వెంట‌నే గుజ‌రాత్‌ బీజేపీ ఇన్‌చార్జి భూపేంద్ర యాద‌వ్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికిప్పుడు విజయ్ రూపానీ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా, రాజీనామా అనంత‌రం గాంధీన‌గ‌ర్‌లో మీడియాతో మాట్లాడిన విజ‌య్ రూపానీ.. ఇన్నాళ్లు త‌న‌కు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసే అవ‌కాశం క‌ల్పించినందుకు బీజేపీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తాను ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆయ‌న సంతృప్తి వ్య‌క్తంచేశారు.

ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.

- Advertisement -