‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..

177
rrr
- Advertisement -

దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి అక్టోబరు 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యేందుకు అక్టోబరు 21 వరకు సమయం పడుతుందని, దాంతో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని చిత్రబృందం తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, సినిమా హాళ్లు పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడం వల్ల కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇప్పుడే ప్రకటించలేమని వెల్లడించింది. త్వరలోనే ప్రపంచ సినిమా కార్యకలాపాలు పుంజుకుంటే, వీలైనంత త్వరగా ఆర్ఆర్ఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కాగా ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రకని, రే స్టీవెన్సన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -