గుజరాత్‌లో ప్రజలను గత 27యేళ్లుగా కాషాయ పార్టీ మోసం చేసిందని గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి గాద్వీ అన్నారు. గుజరాత్‌లో ఆప్ అభ్యర్థులలో ఎక్కువ మందికి పటేళ్లకు ఎక్కువ సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పట్ల గుజరాతీల్లో ఆశలు మొలకెత్తాయని తాను ఆయన ప్రతిష్టను ఇనుమడింపచేస్తానని చెప్పారు. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ క్లైమాక్స్‌కు చేరుకుంది. మాటల తుటాల మధ్య వివిధ ప్రధాన పార్టీలు తలమూనకలైనాయి.
ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గధ్వీ ఓ వార్తాఛానెల్త మాట్లాడుతూ పలు విషయాలు ముచ్చటించారు. తమకు రాజకీయం చేతకాదని ప్రజల కోసం మంచి చేయడమే తెలుసని అన్నారు. గుజరాత్‌లో కాషాయ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసిందని మండిపడ్డారు. ఇంక కొన్ని చోట్ల విద్య ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 1, డిసెంబర్5న రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
ఇవి కూడా చదవండి…