మే 31 వరకు లాక్‌డౌన్ 4.0!

273
lockdown
- Advertisement -

దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్‌ 3.0 నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నాలుగో దశ లాక్ డౌన్ 4.0 పై కీలకప్రకటన చేయనుంది కేంద్రం. మరికొన్ని సడలింపులతో 4.0ను మే 31 వరకు పొడగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

కొన్ని నిబంధనలను పాటిస్తూ, ప్రజా రవాణాకు కూడా అనుమతించవచ్చని తెలుస్తోంది.రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరచుకునే అవకాశాలున్నాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

దేశీయ విమాన ప్రయాణాలకు కూడా పచ్చజెండా ఊపవచ్చని సమాచారం. నగరాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున మెట్రో రైల్ సేవలను ప్రారంబించే ఛాన్స్ లేదు.

మార్చి 25న తొలి విడత లాక్‌డౌన్‌ను ప్రకటించగా, ఆపై దాన్ని ఏప్రిల్ 15న ఒకసారి, మే 4న రెండోసారి పొడిగించిన సంగతి తెలిసిందే.

- Advertisement -