కరోనా బాధితులపై జీఎస్టీ బాదుడు..

287
- Advertisement -

ఒకవైపు కరోనా మహమ్మారి దెబ్బకు కోట్లాది కుటుంబాలు సతమతమౌతుంటే.. మరోవైపు కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) భారం మోపుతున్నారు. కొవిడ్‌ రోగులకు ఉపయోగపడేవి, చికిత్సలో వాడే మందులు, పరికరాలు అన్నింటిపైనా 6 నుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడుతోంది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్యంతో పాటు జీఎస్టీ రూపేణా పడే భారం అదనంగా 15 శాతం దాకా ఉంటోంది.

రెమ్‌డెసివిర్, మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, సంబంధిత పరికరాలపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అత్యధిక ఔషధాలపై 12 నుంచి 18 శాతం భారం పడుతోంది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, పీపీపీ కిట్లు సహా అన్నింటిపైనా ఈ బాదుడు కొనసాగుతోంది. కరోనా పరీక్షలు మొదలు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యి వచ్చే దాకా ఓ కరోనా పేషెంట్ అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది.

12% జీఎస్టీ అమలవుతున్న కరోనా పరికరాలు..

మెడికల్ ఆక్సిజన్
మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్లున్న మాస్కులు
చేతికి వేసుకునే రబ్బర్ గ్లోవ్స్
కరోనా టెస్ట్ కిట్లు, రీ–ఏజెంట్లు
వెంటిలేటర్లు, శ్వాస పరికరాలు
రక్షణ కోసం కళ్లకు పెట్టుకునే అద్దాలు
బ్యాండేజీలు, శస్త్రచికిత్సకు వాడే పరికరాలు

ఇవీ 18 శాతం జీఎస్టీ అమలవుతున్నవి…

శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, డిసిన్ ఫెక్టెంట్లు, సబ్బులు
టిష్యూ పేపర్లు, న్యాప్కిన్లు, వ్యర్థాలు వేసే కవర్లు
వస్త్రంతో చేసిన గ్లోవ్స్ , సెల్యులోజ్ ఫైబర్ తో చేసిన మాస్క్ లు, తలకు వాడే నెట్ లు
స్టెరిలైజేషన్ కోసం వాడే ఇథైల్ ఆల్కహాల్
రోగుల నుంచి ద్రవాలు సేకరించే శానిటరీ వేర్
ల్యాబ్ పరికరాలు, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్లు, క్యాలిబరేటింగ్ మీటర్లు

- Advertisement -