జీఎస్టీ అంటే.. ఓ విలన్‌: రాహుల్‌

200
GST is Gabbar Singh Tax
- Advertisement -

గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జీఎస్టీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ జీఎస్టీకి ఓ కొత్త నిర్వచనం చెప్పారు రాహుల్.

దేశ ప్రజల పట్ల జీఎస్టీ ఓ విలన్‌గా మారిందని, కొత్త పన్ను విధానం జీఎస్టీ ద్వారా లక్షల మంది చిన్న వ్యాపారులు రోడ్డున్న పడ్డారని కేంద్ర ప్రభుత్వం విధానాలని ఎండగట్టే ప్రయత్నం చేశారు.

    GST is Gabbar Singh Tax

గుజరాత్ ప్రజలకు విద్య, ఉపాధి, ఆరోగ్యం కావాలని, కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమీ ఇవ్వడం లేదన్నారు. పటేల్ సామాజిక వర్గం నేత నరేంద్ర పటేల్‌కు లంచం ఇచ్చి అతడిని తమతో కలుపుకుపోయేందుకు ప్రయత్నించిందంటే బీజేపీ పరిస్థితి ఎంతకు దిగజారిందో ఓటర్లకి అర్థమవుతోంది.

కానీ బీజేపీ ఎన్ని డబ్బులు ఇచ్చినా గుజరాత్ యువత అమ్ముడుపోయే రకం కాదనే విషయాన్ని బీజేపీ గ్రహించాలని రాహుల్ గాంధీ హితవు పలికారు.

- Advertisement -