రాష్ట్రాల‌కు జీఎస్టీ పెండింగ్ నిధులు వెల్లడించిన కేంద్రం..

260
Anurag Singh Thakur
- Advertisement -

కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కి జీఎస్టీ పెండింగ్ నిధులు రూ. 2,06,461 కోట్లుగా వెల్లడించింది.లోక్‌ సభ సమావేశాల్లో కేర‌ళ‌ సీపీఐ(ఎం) ఎంపీ ఎల‌మ‌రం క‌రీం అడిగిన ప్ర‌శ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వ‌కంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ జీఎస్టీ పెండింగ్ నిధులు రూ. 6,017 కోట్లు ఉండగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జీఎస్టీ పెండింగ్ నిధులు రూ. 5,269 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఇవి ఏప్రిల్-2020 నుంచి న‌వంబ‌ర్-2020 మ‌ధ్య కాలానికి సంబంధించిన పెండింగ్ నిధులుగా కేంద్రం పేర్కొంది. క‌రోనా సంక్షోభం, లాక్‌డౌన్ కార‌ణంగా జీఎస్టీ బకాయిలు చెల్లించ‌లేద‌ని కేంద్రం వివ‌ర‌ణ‌ ఇచ్చింది.

- Advertisement -