మార్చిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు..

362
gst
- Advertisement -

2021 మార్చి నెల జిఎస్టీ వసూళ్ల గణాంకాలను తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈమేరకు మార్చి నెలలో 1,23,902 కోట్లు జిఎస్టీ వ‌సూలు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు సాధించినట్లు ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. మార్చిలో సీజీఎస్టీ రూ. 22,973 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ. 62,842 కోట్లు, సెస్ రూపంలో రూ. 9,525 కోట్లు రూపంలో వసూలు చేసింది.

గతేడాది మార్చి నెలతో పోల్చితే ఈ ఏడాది 27% వృద్ధి నమోదు అయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర జిఎస్టీ వ‌సూళ్ళు రూ. 4,166.42 కోట్లుగా కేంద్రం తెలిపింది. గతేడాది మార్చి నెలతో పోల్చితే తెలంగాణలో 17% పెరిగిన జిఎస్టీ వసూలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

- Advertisement -