అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లను ప్రకటించిన కేంద్రం..

158
nirmala
- Advertisement -

2021 అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.. అక్టోబరులో జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.1,30,127 కోట్లు అని వివరించింది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇవి రెండో అత్యధిక వసూళ్లు అని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ లో రూ.1.41 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్టు కేంద్రం వివరించింది.

ఇక అక్టోబరు మాసానికి సంబంధించి కేంద్ర జీఎస్టీ రూ.23,861 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ.30,421 కోట్లు అని తెలిపింది. సమీకృత జీఎస్టీ రూ.67,361 కోట్లు కాగా, సెస్ రూపేణా రూ.8,484 కోట్లు వసూలు అయినట్టు వివరించింది. కాగా, జీఎస్టీ లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా నాలుగో సారి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితి క్రమంగా పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం.

- Advertisement -