సతీష్ ధావన్ సెంటర్ వేదికగా ఇస్రో జరిపిన మరో ప్రయోగం సక్సెస్ అయింది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్‌వీఎస్ – 01 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. కౌంట్‌డౌన్ నిర్వహించే ప్రక్రియ ఆదివారం ఉదయమే ప్రారంభంకాగా 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు ఉంటుందని ఇస్రో తెలిపింది. రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది.
Also Read:తెలంగాణ…ఆవిర్బావం ప్రత్యేకం
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో 2,232 కిలోల ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తోంది. ఈ శాటిలైట్ 12 ఏళ్లపాటు సేవలందించనుంది. దేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్–01 మొదటిది.
Also Read:KTR:రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా..?