బీజేపీలో గ్రూప్ వార్..బూరకు షాక్!

20
- Advertisement -

తెలంగాణ బీజేపీలో గ్రూప్ వార్ బట్టబయలైంది. భువనగిరి నుండి పోటీ చేస్తున్న బూర నర్సయ్య గౌడ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కుల రాజకీయాలు చేస్తున్నారంటూ బూరపై ఫైర్ అయ్యారు.

నర్సయ్యగౌడ్ కు మద్దతుగా ప్రచారంకు సీనియర్ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, శ్యామ్ సుందర్ తో పాటు పలువురు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల వేళ నేతల మధ్య గ్రూప్ వార్ తో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరారు బూర. ఆ తర్వాత బీజేపీ టికెట్ దక్కించుకున్న కాషాయ నేతల నుండి మద్దతు కరువైంది. దీంతో కుల రాజకీయాలకు తెరలేపారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

Also Read:వేసవిలో కూల్ కూల్ గా నిమ్మరసం?

- Advertisement -