పైరవీలకు తావులేకుండా ఉద్యోగాలిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మన టీవీ ద్వారా గ్రూప్ 2 పరీక్ష కోచింగ్ ఇచ్చేందుకు ఇస్రోతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలకు ఇస్రో ప్రతినిధులు..మంత్రి కేటీఆర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ అన్ని రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
మన టీవీ ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. ఇస్రోది ఘనమైన చరిత్ర అని తెలిపారు. వ్యవసాయం రంగంలో శాటిలైట్ పరిజ్ఞానం ఉపయోగించుకుంటామని…అక్టోబర్ 1 నుంచి మన టీవీ ద్వారా గ్రూప్ 2 కోచింగ్ ఇస్తామని తెలిపారు. అక్టోబర్ 14 తర్వాత 6 వేల స్కూళ్లలో డిజిటల్ క్లాసులు ఇస్తామని తెలిపారు. సివిల్స్,ఎంసెట్ లాంటి ప్రతి పోటి పరీక్షకు కోచింగ్ ఇస్తామని తెలిపారు.ప్రభుత్వ,ప్రైవెట్ ఉద్యోగాకు సైతం మనటీవీ ద్వారా కోచింగ్ ఇస్తామని తెలిపారు. టీఎస్ పీఎస్సీ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని… రెండేళ్లలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించిందని తెలిపారు.