గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు రద్దు

7
- Advertisement -

గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పాత్రలను రీవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

8 నెలల్లో మళ్లీ రీవాల్యుయేషన్ చేయాలని TGPSC ని ఆదేశించింది హైకోర్టు. లేనిపక్షంలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం తెలిపింది. మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేశారు కొందరు అభ్యర్థులు. దీంతో మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసింది హైకోర్టు.

Also Read:బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం

రీవాల్యుయేషన్‌ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని..టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని..టీజీపీఎస్సీకి 8 నెలల డెడ్‌లైన్‌ విధించింది హైకోర్టు. 8 నెలల్లో రీవాల్యుయేషన్‌ చేయాలి..లేదా మళ్లీ పరీక్షలైనా నిర్వహించాలని తెలిపింది హైకోర్టు.

- Advertisement -