నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ తో తలపడనుంది హాంకాంగ్. ఈ రోజు రాత్రి 8 గంటలకు మొదలుకానుంది మ్యాచ్. రేపు యూఏఈతో టీమిండియా మ్యాచ్ జరగనుంది.
మొత్తం 8 జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ నేరుగా అర్హత పొందగా, యూఏఈ, ఒమన్, హాంకాంగ్ టీమ్‌లు ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నాయి.
గ్రూపులు:
గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ B: ఆఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక
గ్రూప్ దశ
సెప్ 9: ఆఫ్ఘానిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి (8:00 PM IST)
సెప్ 10: భారత్ vs యూఏఈ, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 11: బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి (8:00 PM IST)
సెప్ 12: పాకిస్థాన్ vs ఒమన్, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 13: బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి (8:00 PM IST)
సెప్ 14: భారత్ vs పాకిస్థాన్, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 15: యూఏఈ vs ఒమన్, అబుదాబి (5:30 PM IST)
సెప్ 15: శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 16: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘానిస్తాన్, అబుదాబి (8:00 PM IST)
సెప్ 17: పాకిస్థాన్ vs యూఏఈ, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 18: శ్రీలంక vs ఆఫ్ఘానిస్తాన్, అబుదాబి (8:00 PM IST)
సెప్ 19: భారత్ vs ఒమన్, అబుదాబి (8:00 PM IST)
Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
సూపర్ ఫోర్
సెప్ 20: B1 vs B2, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 21: A1 vs A2, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 23: A2 vs B1, అబుదాబి (8:00 PM IST)
సెప్ 24: A1 vs B2, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 25: A2 vs B2, దుబాయ్ (8:00 PM IST)
సెప్ 26: A1 vs B1, దుబాయ్ (8:00 PM IST)
ఫైనల్
సెప్ 28: దుబాయ్ (8:00 PM IST)
మొదటిసారి సెప్టెంబర్ 14న తలపడతాయి. ఆ తర్వాత సూపర్ ఫోర్‌లో సెప్టెంబర్ 21న మరోసారి తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు ఫైనల్‌కు చేరితే మూడోసారి ఈ రెండు జట్ల పోరు జరగనుంది.

