ఈ డ్రింక్స్ తాగితే ఎన్ని లాభాలో!

28
- Advertisement -

చాలమందికి తిండి పైన మమకారం ఎక్కువ. ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇక పండగ సమయాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో రుచికరమైన రకరాల పిండి వంటలతో పాటు అలా బయటకు వెళ్లినప్పుడు నోరూరించే ఆహార పదార్థాలు తినక మానరు. ఇలా ఏది పడితే అది తినడం వల్ల శరీరంలో టాక్సీన్ల సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ లాంటివి అధికంగా తినడం వల్ల వ్యర్థమైన కొవ్వు శాతం పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించే సహజసిద్దమైన డ్రింక్స్ తాగడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం !

మంచినీరు
చాలమంది నీరు తక్కువగా తాగుతుంటారు. అందువల్ల తిన్న ఆహారం కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతిరోజూ 4-5 లీటర్ల నీరు తాగితే శరీరంలో టాక్సీన్ల సమస్య తగ్గుతుంది.

నిమ్మరసం
శరీరంలో టాక్సీన్లను బయటకు పంపించడంలో నిమ్మరసం చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి వ్యర్థాలను బయటకు పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఒక గ్లాసు నిమ్మరసం తాగితే మేలని చెబుతున్నారు నిపుణులు

గ్రీన్ టీ
సాధారణంగా చాలా మందికి ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే వాటి బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఎంతో మేలట. గ్రీన్ టీ లో ఉండే ఔషధ గుణాలు కడుపులోని వ్యర్థాలను బయటకు పంపించడం తో పాటు కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

ఇంకా వివిధ రకాల పండ్ల రసాలు, కూరగాయల రసాలు కూడా చర్మంలోని టాక్సీనను బయటకు పంపించి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:గ్రూప్ రాజకీయాలపై కంగనా కామెంట్స్

- Advertisement -