దాసరి జయంతి.. మొక్కలు నాటిన నరేష్..

29
green challeang

ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు, దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు 74వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ మరియు దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం చేపట్టారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం, అన్నారుగూడెం గ్రామంలో మంగళవారం దాసరి పద్మ స్మారక యువజన సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు గుమ్మా నరేష్ మొక్కలు నాటారు.