అత్యధిక మొక్కలు నాటిన సంస్థగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. గతంలో కేవలం ఒక గంట సమయంలో అత్యధిక మొక్కలు నాటిన రికార్డును కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సొంతం చేసుకుంది. సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ 2018 జులైలో ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రజలు పెద్ద ఎత్తున్న ఆదరిస్తున్నారు.
2021 జూలై4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జోగురామన్న ఆధ్వర్యంలో ఒక గంటలో 16,900వందల మంది భాగస్వామ్యంతో 3,54,900మొక్కలు నాటారు. దీంతో ఈ రికార్డును లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరు 21మొక్కలు నాటారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ద్వారా 18కోట్లకు పైగా మొక్కలు నాటారు. దీంతో భారత ప్రభుత్వం నిర్దేశించిన 33శాతం అడవుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం దగ్గరిగా ఉంది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో చిన్నా పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా పాలుపంచుకుంటున్నారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, సంజయ్‌దత్, సల్మాన్‌ఖాన్, అజయ్ దేవ్‌గణ్, కంగనా రనౌత్, ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్, తదితరులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కీసర రిజర్వు ఫారెస్ట్, కరేపల్లి రిజర్వు ఫారెస్టు, ముంబా రిజర్వు ఫారెస్టులను దత్తత తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంను కొనసాగిస్తున్నారు.
Also Read: CMKCR:షెడ్యూల్ విడుదల…
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటకు హరితహరం అనే కార్యక్రమం ద్వారా తాను స్పూర్తి పొందినట్టు తెలిపారు. ఇప్పటివరకు కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో 7-9శాతం పచ్చదనం సంతరించుకుందన్నారు. ప్రధాన నినాదం ప్రజల్లో మొక్కలు పెంపకంపై అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్‌లో మొక్కలను పెంచుతారని అన్నారు.
Also Read: రాహుల్ “జనంతో మమేకం “.. వ్యూహం ఫలిస్తుందా ?
Another feather in the crown for the #GreenIndiaChallenge as we enter the Limca Book of Records. The credit goes to the Honourable Chief Minister Sri KCR garu, whose inspiration started this initiative. Thank you so much @IndiaToday and @sardesairajdeep ji for amplifying our… https://t.co/FQ2D3WxlIv pic.twitter.com/U9IF9QSJgA
— Santosh Kumar J (@SantoshKumarBRS) June 30, 2023