గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది.
శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు గారు, డిఐజి తాప్సిర్ ఇక్బాల్ హాజరై దాదాపు 150 మంది సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రైనింగ్ అకాడమీ ఆవరణంలో పచ్చదనం పెంచడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని 80 ఎకరాల ప్రదేశంలో ఏ సందర్భం వచ్చినా కూడా మొక్కలు నాటడం జరుగుతోందని అలా నాటిన మొక్కలు ఈరోజు 20 వేలకు చేరుకున్నాయని తెలిపారు. గతంలో నీళ్ళు లేకపోవడం వల్ల మూడు వాటర్ ట్యాంకులను పెట్టి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించి నాటిన మొక్కల కు నీళ్ళు పొయ్యడం జరిగిందని దీనివల్ల ఆర్థిక ఇబ్బంది గురవుతున్నామని ఆలోచన చేసి 2 పెద్ద ఇంకుడు గుంతలు తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా ఈ రోజు అకాడమీ ఆవరణంలో భూగర్భ జలాలు పెరిగి బోర్లు నీరు పోయడం జరుగుతుంది వాటితో మొక్కలకు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా ఈ శిక్షణ కేంద్రంలో శునకాలకు ఇచ్చే శిక్షణ ప్రత్యేకమైనదని దేశంలో ఉన్న బీహార్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి వచ్చి ఆ రాష్ట్రాల వారు శునకాలకు శిక్షణ అదేవిధంగా వీఐపీలకు భద్రత అధికారుల శిక్షణ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.గత మూడు సంవత్సరాలుగా ఈ శిక్షణ కేంద్రంలో 15,000 మందికి వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధతో నిర్మిస్తున్న యాదాద్రి టెంపుల్ సిటీ కి ఇచ్చే భద్రత సిబ్బందికి కూడా ఇక్కడే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.
పచ్చదనం పెంచడం కోసం శిక్షణ అకాడమీలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి, ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారిని అభినందించడం జరిగింది. ముఖ్యంగా నీటి నిల్వ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భజలాలు పెరిగే విధంగా చేసిన సిబ్బందిని అభినందించడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొక్కలు నాటిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు శ్రీనివాస్, కిషన్ రావు, కిరణ్ రావు, భాష ,మాధవరావు, డాక్టర్ మధుసూదన్, వాసుదేవ రెడ్డి, BV రెడ్డి, శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ రాయ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.