రాజ్యసభ సభ్యులు ఎంపి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఈ రోజు ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా మొక్కలు నాటారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రకారం ఒక వ్యక్తి మొక్కలు నాటి మరో ముగ్గురు వ్యక్తులకు ఛాలెంజ్ ఇస్తారు. అది అంగీకరించే మరియు పూర్తి చేసే వ్యక్తులు వ్యక్తిగతంగా మొక్కలు నాటి, మరో ముగ్గురు వ్యక్తులకు సవాలు ఇస్తారు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ ఎల్లపుడూ తల్లి భూమిని పచ్చగా మరియు అందంగా మార్చడం కొనసాగిస్తుంది.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా కలెక్టర్ అనితారామచంద్రన్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రఖ్యాత ఆల్ ఇండియా ఇన్స్‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) బిబినగర్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా ఇన్స్‌ట్యూట్ యొక్క అధ్యాపకులు మరియు సిబ్బందితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 30 మొక్కలు నాటారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక గొప్ప కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణకి, వత్గావరణంలో వచ్చే హెచ్చు తగ్గుదలను సమత్యుల్యం చేయడం కోసం మొక్కలు నాటాలని అన్నారు. ఎయిమ్స్ బిబి నగర్ క్యాంపస్‌ను గ్రీన్ క్యాంపస్‌గా మార్చడానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, దానికి ఒక ప్రతినిధిని నియమించి ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ఇప్పటికే 600 మొక్కలు నాటామని, 20000 మొక్కలు తమ లక్ష్యం అని ఆయన తెలిపారు.
ఈ లక్ష్యాన్ని గ్రీన్ ఇండియా చాలేంజ్ ద్వారా పూర్తి చేస్తామని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ఇలానే కొనసాగించడానికి మరో ముగ్గురు వ్యక్తులను క్యాంపస్ కోఆర్డినేటర్ ఎయిమ్స్, బిబినగర్, డాక్టర్ కె గోవింద్ ప్రొఫెసర్ & కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్ హెడ్ డిపార్ట్మెంట్, కె.బి.ఆర్. దీప్తి మేనేజర్ (సివిల్) గార్లకు డాక్టర్ వికాస్ భాటియా ఛాలెంజ్ చేశారు.